News

రామతీర్థంలో సహస్ర దీపాలంకరణ

81views

విజయనగరం జిల్లాలోని నెల్లిమర్లలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం రామతీర్థం సీతారామస్వామి దేవస్థానంలో సహస్ర దీపాలంకరణ కార్యక్రమాన్ని ఆలయ అర్చకులు శుక్రవారం వైభవంగా నిర్వహించారు. వేకువజామున స్వామికి ప్రాతః కాలార్చన పూజలు నిర్వహించిన తరువాత యాగశాలలో నిత్య హోమాలు, వెండి మండపం వద్ద స్వామి కల్యాణ మహోత్సవాన్ని శాస్త్రోక్తంగా జరిపించారు. సాయంత్రం 6 గంటలకు సీతారామస్వామి ఉత్సవ విగ్రహాలను ఊరేగింపుగా దీపారాధన మండపంపైకి తీసుకువచ్చి ప్రత్యేక ఊయలలో ఆశీనులు చేశారు. అనంతరం దీపాలు వెలిగించి ఊంజల్‌ సేవ జరిపించారు. కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.