News

కురాన్ దహనం ఫేక్‌న్యూస్‌ కేసులో దొరికిపోయిన ‘ఆల్ట్ న్యూస్’ జుబేర్

252views

ఆల్ట్ న్యూస్ సహ వ్యవస్థాపకుడు, సత్యశోధకుడిగా (ఫ్యాక్ట్ చెకర్)గా తనకు తానే చెప్పుకునే మహమ్మద్ జుబేర్ మరోసారి అబద్ధాలాడుతూ పోలీసులకు దొరికిపోయారు. గతంలో చాలాసార్లు తప్పుడు లేదా నకిలీ వార్తలు (ఫేక్‌ న్యూస్) వ్యాపింపజేస్తూ పట్టుబడిన జుబేర్, ఈసారి ఉత్తరాఖండ్ పోలీసుల చేతికి చిక్కాడు.

సోమవారం జుబేర్ తన ఎక్స్ ఖాతాలో ఒక వార్తాకథనం గురించి పోస్ట్ చేసాడు. కురాన్‌ను తగులబెట్టేసారంటూ ముస్లిములను రెచ్చగొట్టే కథనాన్ని షేర్ చేసాడు. ఆ పోస్ట్‌లో అతను ఇలా రాసుకొచ్చాడు. ‘‘ఇటీవల సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ అయింది. రూర్కీ నగరానికి చెందిన యూట్యూబర్ ఒకరు కురాన్‌ను తగులబెట్టి ధ్వంసం చేస్తున్నట్లుగా ఉంది. రూర్కీ పోలీసులు అత్యవసరంగా ఆ విషయాన్ని పరిశీలించాలి’’ అని రాసుకొచ్చాడు.

విచిత్రమేంటంటే సత్యశోధకుడిని అని తనకు తనే చెప్పుకునే ఈ ప్రముఖ ఫ్యాక్ట్ చెకర్, ఈ వార్తకు ఆధారం ఏమీ చూపించలేదు. ఆ వీడియోను కూడా షేర్ చేయలేదు. ఆ సమాచారం ఎంతవరకూ సరైనదో కాదో అని పరిశీలించలేదు. ఈసారికి ఆ బాధ్యతను మాత్రం పోలీసులకు వదిలేసాడు.

‘ఫ్యాక్ట్ చెకర్’ని అని చెప్పుకునే వ్యక్తి, తాను ఎలాంటి ఫ్యాక్ట్ చెకింగూ చేయకుండా అలాంటి సున్నితమైన అంశం మీద ప్రజలను, ప్రత్యేకించి ముస్లిములను పక్కదోవ పట్టించేలాంటి వార్తను ప్రచురించాడు.ముస్లిములను తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నించాడు. ఆ ట్వీట్ చూసిన ముస్లిములు రెచ్చిపోయి హిందువులపై దాడులు చేయాలనేది అతని ఉద్దేశమని అర్ధమవుతోంది.

జుబేర్ ఇలా తప్పుడు వార్తలు ప్రసారం చేయడం ఇదేమీ మొదటిసారి కాదు. గతంలోనూ జుబేర్ తప్పుడు వార్తలు ప్రచారం చేసిన కనీసం 60 సంఘటనలు నమోదై ఉన్నాయి.