ArticlesNews

వైమానిక శాస్త్ర పితామహుడు భరద్వాజ

158views

బృహస్పతి తనయుడు భరద్వాజుడు వైమానిక శాస్త్ర పితామహుడు. విమానాల గురించి తొలుత వర్ణించిన శాస్త్రవేత్త. ‘యంత్రసర్వస్వం’ అనే గ్రంథంలో శకున, సుందర, రుక్మ, త్రిపుర అనే వివిధ రకాల విమానాల గురించి వర్ణించాడు. వాటి తయారీ, ఉపయోగాలవంటి అనేక విశేషాలు అందులో ఉన్నాయి. దీని అసలు ప్రతి బరోడాలోని రాజకీయ సాంస్కృతిక గ్రంథాలయంలో నేటికి ఉందంటారు. గ్రహాల వేగం, కాంతి, ధ్వని, తంతివార్త (టెలిఫోన్), విద్యుచ్ఛక్తి తదితర ప్రయోగా లను ‘అంశుబోధిని’ గ్రంథంలో పొందుపరిచారు. దీనిని జర్మనులు తమ భాషలోకి అనువదించారు.

రుగ్మతలు కోసం కశ్యప, వశిష్ఠ, అంగీరసుడు, జమదగ్ని తదితర మహా మునుల కోరిక మేరకు ఇంద్రుడి వద్ద ఆయుర్వేదాన్ని అభ్యసించాడు. అలా ఆయుర్వేద విద్యను లోకానికి అందించిన మహనీయుడు. ఆయన స్వయంగా ఔషధం తయారు చేస్తూ ఆయుర్వేదానికి ప్రాచుర్యం కల్పించినట్లు చెబుతారు. ఆయన వద్ద శిష్యరికం చేసిన ఆత్రేయ పునర్వసు ఆయుర్వేద శాస్త్రంలో కాయకల్ప చికిత్స ప్రవేశ పెట్టాడు. ఇలా భరద్వాజుడు శిష్య ప్రశిష్యులతో భావితరాల మనుగడకు అన్ని రకాల శాస్త్రాలు అందించడంలో తమ జీవితాన్ని అంకితం చేశారు.

అధ్యయనం,పరిశోధనల్లో నేటి శాస్త్రవేత్తలకు ఆదర్శ ప్రాయుడయ్యాడు. రామాయణ మహాకావ్యానికి నాందిగా చెప్పే ‘మానిషాద ప్రతిష్టాంత్వమాగమ శ్శాశ్వతీస్సమాః…’ అని వాల్మీకి నోట వెలువడిన శ్లోకాన్ని ఆయన చేశాడని అంటారు. సీతా రామలక్ష్మణులు వనవాససమయంలో శ్రీరాముడు భరద్వాజ ఆశ్రమాన్ని సందర్శించాడు.విశ్వకర్మ సహాయంతో భరద్వాజ ఘనంగా విందు ఏర్పాటు చేశాడు. అప్పటి వరకు అలాంటి విందు కనీవినీ ఎరుగనందున దానికి ‘భరద్వాజ విందు’అనే పేరు వచ్చిందని రామాయణం చెబుతోంది. మృష్టాన్నలను ఆరగించి నప్పుడు నేటికీ ఈ నానుడిని ఉపయోగిస్తుంటారు.