News

మదనపల్లెలో సంఘ కార్యకర్తల శిక్షణ కొరకు కార్యకర్త వికాసవర్గ

283views

సంఘ పని మరింత నైపుణ్యంతో చేయాలనే ఆలోచనతో, నేర్చుకోవడానికి కార్యకర్త వికాసవర్గ దోహదపడుతుందని దక్షిణ మధ్య క్షేత్ర సహక్షేత్ర ప్రచారక్ శ్రీ శ్రీరాం భరత్ కుమార్ అన్నారు.అన్నమయ్య జిల్లా మదనపల్లి సమీపంలోని శ్రీ వేద స్కూల్ లో మే 18 నుండి జూన్ 7 వ తేది వరకు జరుగుతున్న కార్యకర్త వికాస వర్గ-1 కార్యక్రమంలో పాల్గొన్న కార్యకర్తలను ఉద్దేశించి శ్రీరాం భరత్ కుమార్ మాట్లాడుతూ, సుఖం కోరుకునేవారు చదువు మానేయాలి, చదువు కోరుకునేవారు సుఖాన్ని త్యజించాలన్నారు.కష్టపడటానికి సిద్ధమవడం వల్లే రామలక్ష్మణులు విశ్వామిత్రుని వద్ద అనేక విద్యలు నేర్చుకున్నారని చెప్పారు. ఏ స్థాయి కార్యకర్తగా సంఘలో పని చేస్తున్నా నిరంతరంగా ప్రశిక్షణ పొందుతూనే ఉండాలన్నారు.సంఘ ఆపేక్షకు అనుగుణంగా శిక్షణ పొందాలని, పనిచేయాలని తెలిపారు. వర్గలో శారీరిక, బౌద్ధిక వ్యవస్థ విషయాలు నేర్చుకోవడంతోపాటు వ్యవహార శిక్షణ కూడా లభిస్తుందని పేర్కొన్నారు. మంచి స్వయంసేవక్ గా సంఘ కార్యం చేయడానికి, పర్యటనా కార్యకర్తగా శాఖా విస్తరణకు, స్వయంసేవకుల తయారీకి ఏం చేయగలము అనేది ఆలోచించాలని, వీటి కోసం శరీరం, మనస్సు, బుద్ధిని నిమగ్నం చేయాలని వివరించారు.

కార్యకర్త వికాసవర్గలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల నుండి వచ్చిన 245 మంది కార్యకర్తలు శిక్షణ తీసుకోనున్నారు. ఈ కార్యకర్త వికాస వర్గ-1కి వర్గాధికారిగా శ్రీ మంచన రామచంద్ర రాజు వర్గ కార్యవాహగా శ్రీ కా.శం.శ్రీధర్ లు వ్యవహరిస్తున్నారు