News

భారతీయ సంస్కృతిలో జీవన విలువలు

60views

భారతీయ సంస్కృతిలో జీవన విలువలున్నాయని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఆర్‌ఎస్‌ఎస్‌ అఖిల భారతీయ కార్యకారిణి సభ్యులు డాక్టర్‌ వారణాసి రామ్‌మాధవ్‌ అన్నారు.కాకినాడలోని స్థానిక సూర్యకళా మందిరంలో న్యూ ఢిల్లీకి చెందిన కొచ్చర్లకోట రామరాజు ఛారిటబుల్‌ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రముఖ సంగీత వాగ్గేయ కారుడు కొచ్చర్లకోట రామరాజు 148వ జయంతి వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా మాట్లాడుతూ సంగీత వాగ్గేయ కారుడు రామరాజు తన కళను ధన సంపాదన కోసం కాకుండా కీర్తి సంపాదించేందుకు ఉపయోగించడం ఎంతో అభినందనీయమన్నారు. ప్రతి వ్యక్తి ధార్మిక భావంతో ఉన్నప్పుడే కళలు విశ్వవ్యాప్త మవుతాయన్నారు. క్రీ.స్తుశకం 6వ శతాబ్దం వరకు ఎటువంటి కుల వివాదాలు లేవని, విదేశీయుల దండయాత్రలతో కులో న్మాధం ప్రజ్వరిల్లిందని ఈ విషయాన్ని పాశ్చాత్య దేశాలు సైతం అంగీకరిస్తున్నాయన్నారు.సంగీతం మనుకు ప్రశాంతత ఇస్తుం దన్నారు. ఉగ్రరూపంలో ఉండే దేవతలు సైతం సంగీత కళ వాయిద్యాల ద్వారా ప్రశాంత రూపంలో భక్తులను దర్శనం ఇస్తున్నారన్నారు.