News

ఆదిశంకరుడి 2500వ వార్షిక ముక్తి జాతీయ సదస్సు

126views

తమిళనాడులోని కాంచీపురం సమీప ఏణాత్తూర్‌లోని పరమాచార్య శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి విశ్వమహా విద్యాలయం ప్రాంగణంలో అంతర్జాతీయ సదస్సు ప్రారంభమైంది. ఆదిశంకరుడి 2500వ వార్షిక ముక్తి పొందిన దినోత్సవం సందర్భంగా ఆయన పాదయాత్ర సమయాల్లో తయారు చేసిన గ్రంథాలకు సంబంధించి సంస్కృత, భారత కళాచారం విభాగాల తరఫున మూడురోజుల పాటు కొనసాగే జాతీయ సదస్సు ప్రారంభోత్సవం శనివారం సాయంత్రం ఇక్కడి గ్రంథాలయ భవనంలో జరిగింది. కంచి కామ కోటి పీఠాధిపతి శంకర విజయేంద్ర సరస్వతి స్వామి ఆశీస్సులతో విశ్వవిద్యాలయ కులపతి వి.కుటుంబశాస్త్రి అధ్యక్షతన నిర్వహించిన సదస్సు ప్రారంభోత్సవంలో విశిష్ట అతిథిగా రాష్ట్ర గవర్నరు ఆర్‌.ఎన్‌.పాల్గొని మాట్లాడారు. శంకర విజయేంద్ర సరస్వతి అనుగ్రహభాషణ చేశారు. సదస్సులో పాల్గొన్న వారికి తొలుత గవర్నర్‌ విశ్వవిద్యాలయ ప్రాంగణంలోని నిలువెత్తు భారీ ఆదిశంకరుడి విగ్రహానికి పుష్పాంజలి నిర్వహించారు