405views
తిరుమలలోని నారాయణగిరి గార్డెన్స్‌లో పరిణయోత్సవాలు ఈరోజు ప్రారంభమయ్యాయి.
ఈనెల 19వతేదీ.. మూడు రోజుల పాటు పద్మావతి శ్రీనివాస పరిణయోత్సవం వైభవంగా జరుగనుంది.ఈ నేపథ్యంలో ఉదయాన్నే మండపంలో శ్రీదేవి భూదేవి, శ్రీనివాసుల కల్యాణ మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. అనంతరం మలయప్పస్వామి
గజవాహనంపై ఊరేగారు.ఈ మూడు రోజుల్లో ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవలను టీటీడీ రద్దు చేసింది. ప్రతి వైశాఖ శుద్ధ దశమి తిథికి ఒకరోజు ముందు, ఒకరోజు తర్వాత మూడు రోజుల పాటు పద్మావతి పరిణయోత్సవాన్ని టిటిడి నిర్వహిస్తూ వస్తోంది.





