News

సీఏఏ కింద తొలిసారి 14 మందికి భారత పౌరసత్వ సర్టిఫికెట్లు

215views

పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) కింద తొలిసారి 14 మందికి భారత పౌరసత్వ సర్టిఫికెట్లను అందజేశారు. పాకిస్థాన్‌, ఆఫ్ఘనిస్థాన్‌, బంగ్లాదేశ్‌లో వేధింపులకు గురైన ముస్లిమేతర వలసదారులు భారతీయులుగా గుర్తింపు పొందారు. బుధవారం ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో కేంద్ర హోం కార్యదర్శి అజయ్ కుమార్ భల్లా 14 మంది దరఖాస్తుదారులకు పౌరసత్వ ధృవీకరణ పత్రాలు అందజేశారు.

బుధవారం సీసీఏ కింద ఢిల్లీలోని 300 మందికి భారత పౌరసత్వ సర్టిఫికెట్లు అందజేసినట్లు కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా తెలిపారు. కాగా, పాకిస్థాన్‌, ఆఫ్ఘనిస్థాన్‌, బంగ్లాదేశ్‌లో వేధింపులకు గురై భారత్‌కు వలస వచ్చిన ముస్లిమేతర ప్రజలకు భారత పౌరసత్వాన్ని మంజూరు చేసే ప్రక్రియను 2019లో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చేపట్టింది. దీని కోసం పౌరసత్వ చట్టాన్ని సవరించింది.