
283views
వైశాఖ మాస నృసింహ జయంతి బ్రహ్మోత్సవాలు కనులపండువగా సాగుతున్నాయి. అహోబిలేశుడు విశేష అలంకృతుడై వాహనాలపై విహరిస్తూ భక్తులకు దర్శనమిస్తున్నారు. బుధవారం ఎగువ అహోబిలంలో జ్వాలా నృసింహస్వామి యోగానృసింహ అలంకరణలో గరుడ విమాన పల్లకిపై శ్రీదేవి, భూదేవి సమేతంగా కొలువుదీరారు. వేదపండితులు స్వామి, అమ్మవార్లను తిరువీధిలో ఊరేగించారు. మధ్యాహ్నం స్వామి, అమ్మవార్లను అభిషేక మండపంలో కొలువుంచి పంచామృతాలతో అభిషేకం జరిపారు. సాయంత్రం హనుమంత వాహనంపై జ్వాలా నృసింహస్వామి విహరిస్తూ భక్తులను అనుగ్రహించారు. గురువారం ఉదయం శేషవాహనంపై జ్వాలా నృసింహ స్వామి విహరిస్తారు. మధ్యాహ్నం అభిషేకం, రాత్రి చంద్రప్రభ వాహనం పై దర్శనమిస్తారు. ఆలయ ప్రధానార్చకుడు కిడాంబి వేణుగోపాలన్, మణియార్ సౌమ్యనారాయణన్ ఆధ్వర్యంలో ఉత్సవాలు నిర్వహిస్తున్నారు.





