News

పీవోకేలో అదే టెన్షన్

412views

పాక్ అక్రమిత కాశ్మీర్ (పీవోకే)లోని పరిస్థితులు ఆందోళనకరంగానే ఉన్నాయి. పెరిగిన గోధుమ పిండి ధరలు, విద్యుత్ చార్జీలు, పన్నులను నిరసిస్తూ చేపట్టిన సమ్మె సోమవారం నాల్గో రోజుకు చేరుకుంది. ఈ నేపథ్యంలో అక్కడ జనజీవనం స్తంభించింది. పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ పీవోకేలోని పరిస్థితులపై ఆందోళన వ్యక్తం చేశారు. వెంటనే సమావేశాన్ని నిర్వహించారు.

ఆ ప్రాంతంలోని సమస్యలు పరిష్కరించేందుకు గతంలోనే జమ్మూకాశ్మీర్ జాయింట్అవామీ యాక్షన్ కమిటీ (జేఏఏసీ) సభ్యులు, పీవోకే ప్రాంత కార్యదర్శి దావూద్ బరీచ్ తో చర్చలు జరిపారు. రాయితీపై విద్యుత్తు, గోధుమపిండిని అందించాలని కోరారు. ఈ చర్చలు అసంపూర్తిగా ముగిశాయి. దీంతో జేఏఏసీ నాయకులు నిరసనలకు పిలుపునిచ్చారు. ముజఫరాబాద్ లాంగ్ మార్చ్ కు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ప్రభుత్వం భారీగా భద్రతా సిబ్బందిని ఏర్పాటు చేయడంతో ఘర్షణలు చోటు చేసుకున్నాయి.