News

17 నుంచి పద్మావతీ పరిణయోత్సవాలు

225views

తిరుమలలో శ్రీపద్మావతి శ్రీనివాసుల పరిణయోత్సవాలు ఈ నెల 17 నుంచి 19వ తేదీ వరకు జరుగనున్నాయి. నారాయణ గిరి ఉద్యానవనాల్లోని పరిణయోత్సవ మండ పంలో మూడు రోజుల పాటు నిర్వహించనున్న ఈ వేడుకల్లో తొలిరోజు శ్రీమలయప్పస్వామి గజ వాహనం, రెండవ రోజు అశ్వ వాహనం, చివరిరోజు గరుడ వాహనంపై వేంచేపు చేస్తా రు. మరోపక్క ఉభయనాంచారులు ప్రత్యేక పల్లకీలలో పరిణయోత్సవ మండపానికి వస్తారు. ఆ తర్వాత కల్యాణమహోత్సవం కన్నుల పండుగగా నిర్వహిస్తారు. కాగా, పరిణ యోత్సవాల సందర్భంగా మూడు రోజుల పాటు ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలం కార సేవలను టీటీడీ రద్దు చేసింది.