News

శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లు.. 18 నుంచి అందుబాటులోకి జులై కోటా

304views

తిరుమ‌ల శ్రీ‌వారి ఆర్జిత సేవా టికెట్లకు సంబంధించిన జులై నెల కోటాను ఈ నెల 18న ఉదయం 10 గంట‌ల‌కు తితిదే ఆన్‌లైన్‌లో విడుదల చేయ‌నుంది. ఈ సేవా టికెట్ల ఎలక్ట్రానిక్ డిప్ కోసం 20న ఉదయం 10 గంటల వరకు ఆన్‌లైన్‌లో నమోదు చేసుకునే అవకాశం కల్పించారు. అదేరోజు మధ్యాహ్నం 12 గంటలకు లక్కీ డిప్‌లో టికెట్లు కేటాయిస్తారు. వీటిని పొందిన వారు సొమ్ము చెల్లించి ఖరారు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ మేరకు తితిదే ఓ ప్రకటనలో వెల్లడించింది.

  • కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవా టికెట్ల కోటాను ఏప్రిల్ 22న ఉదయం 10 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేయనున్నారు.
  • వర్చువల్ సేవలు, వాటి దర్శన స్లాట్లకు సంబంధించిన టికెట్లను 22న మధ్యాహ్నం 3 గంటలకు విడుదల చేస్తారు
  • అంగ ప్రదక్షిణం టోకెన్ల కోటాను 23న ఉదయం 10 గంటలకు, శ్రీవాణి ట్రస్టు టికెట్లను ఉదయం 11 గంటలకు విడుదల చేయనున్నారు.
  • తిరుమల, తిరుపతిలో గదుల కోటాను ఏప్రిల్ 24న మధ్యాహ్నం 3 గంటలకు ఆన్‌లైన్‌లో అందుబాటులోకి తీసుకొస్తారు.
  • రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను 24న ఉదయం 10 గంటలకు విడుదల చేయనున్నారు.
  • వ‌యోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులున్నవారు తిరుమల శ్రీ‌వారిని ద‌ర్శించుకునేందుకు వీలుగా ఉచిత‌ ప్రత్యేక దర్శనం టోకెన్ల కోటాను 23న మధ్యాహ్నం 3 గంట‌ల‌కు ఆన్‌లైన్‌లో విడుద‌ల చేస్తారు.
  • శ్రీవారి సేవ కోటాను 27న ఉదయం 11 గంటలకు, న‌వ‌నీత సేవ మ‌ధ్యాహ్నం 12 గంట‌ల‌కు, ప‌ర‌కామ‌ణి సేవ కోటాను మ‌ధ్యాహ్నం ఒంటి గంట‌కు ఆన్‌లైన్‌లో విడుదల చేయనున్నారు.