News

వాడపల్లిలో ద్రవిడ వేద అధ్యయనోత్సవాలు

238views

కోనసీమ తిరుమల వాడపల్లి వేంకటేశ్వరుని తీర్థ, కల్యాణ మహోత్సవాలకు పది రోజుల ముందుగా జరిగే ద్రవిడ వేద అధ్యయనోత్సవాలు శుక్రవారం ఉదయం ప్రారంభమయ్యాయి. శుక్రవారం ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఆలయ ప్రాంగణంలో నిర్వహిస్తున్న ఉత్సవాల్లో అళ్వారుల వద్ద వేద పండితులు వేద పఠనం చేశారు. బాలభోగం, నివేదన, నీరాజన మంత్ర పుష్పం తదితర కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం గ్రామోత్సవం చేశారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఈ నెల 18 నుంచి వారం రోజుల పాటు జరగనున్న కల్యాణోత్సవాల్లో ఈ అధ్యయనోత్సవాలు నిర్వహించడం అనవాయితీ అని దేవదాయ ధర్మదాయ శాఖ డిప్యూటీ కమిషనర్‌, ఆలయ ఈఓ భూపతిరాజు కిశోర్‌ కుమార్‌ వివరించారు. ఆలయ పరిసరాలు గోవింద నామస్మరణతో ప్రతిధ్వనించాయి. భక్తులకు దేవస్థాన అన్నదాన ట్రస్టు ద్వారా ప్రసాదాలు పంపిణీ చేశారు. రాత్రి చెంగోళం నిర్వహించారు. కేరళ కళాకారుల డ్రమ్ము వాయిద్యాలు అలరించాయి.