
349views
భారత గగనతల రక్షణ సామర్థ్యాలు మరింత బలోపేతమయ్యాయి! స్నేహపూర్వక విమానాలను రక్షించుకోవడంలో బలగాలకు సహకరిస్తూ, శత్రు లోహ విహంగాలను నాశనం చేయడంలో దోహదపడే ‘ఆకాశ్ తీర్’ నియంత్రణ, రిపోర్టింగ్ వ్యవ స్థలను సైన్యంలో ప్రవేశపెట్టే ప్రక్రియ గురువారం ప్రారంభమైంది. ‘ఆత్మనిర్బర్ భారత్’ కార్యక్రమంలో భాగంగా ‘ప్రాజెక్ట్ ఆకాశ్మీర్’ కింద వీటిని భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (బెల్) అభివృద్ధి చేసింది. గాజి యాబాద్ బెల్ ఉత్పత్తి చేసిన తొలి బ్యాచ్ కంట్రోల్ సెంటర్లను గురువారం సైన్యంలో ప్రవేశపెట్టారు.





