News

జాతీయ చలనచిత్ర అవార్డుల్లో రెండు కేటగిరీలకు పేరు మార్పు

337views

జాతీయ చలనచిత్ర అవార్డుల్లో భాగంగా అందించే రెండు కేటగిరీల అవార్డులకు పేర్లు మారుస్తున్నట్లు సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో వెల్లడించింది. ‘ఇందిరా గాంధీ అవార్డ్‌ ఫర్‌ బెస్ట్‌ డెబ్యూ ఫిల్మ్‌’ అవార్డును ఇక నుంచి ‘బెస్ట్‌ డెబ్యూ ఫిల్మ్‌ ఆఫ్‌ ఏ డైరెక్టర్‌’గా వ్యవహరించనున్నారు. బహుమతిగా వచ్చే పారితోషకాన్ని ఇప్పటి వరకు నిర్మాత, దర్శకుడికి సమానంగా ఇస్తుండగా.. ఇక నుంచి మొత్తం సొమ్మును దర్మకుడికే ఇవ్వనున్నారు. ఇదే తరహాలో ‘నర్గీస్‌ దత్‌ అవార్డ్‌ ఫర్‌ బెస్ట్‌ ఫీచర్‌ ఫిల్మ్‌ ఆన్‌ నేషనల్‌ ఇంటిగ్రేషన్‌’ను బెస్ట్‌ ఫీచర్‌ ఫిల్మ్‌ ప్రమోటింగ్‌ నేషనల్‌, సోషల్‌, ఎన్విరాన్‌మెంటల్‌ వాల్యూస్‌ అవార్డుగా పిలవనున్నారు. అలాగే ప్రతిష్ఠాత్మక దాదా సాహెబ్‌ ఫాల్కే అవార్డుకు ఇచ్చే రివార్డు మొత్తాన్ని రూ.10 లక్షల నుంచి రూ.15 లక్షలకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు.