News

రేపటి నుంచి మల్లేశ్వరాలయం పునఃప్రారంభం, సరస్వతీదేవిగా దర్శనమివ్వనున్న దుర్గమ్మ

304views

విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై మల్లేశ్వరాలయం పునఃప్రారంభ కార్యక్రమాలను ఈ నెల 14 నుంచి 18 వరకు నిర్వహిస్తున్నట్టు దేవస్థానం ఒక ప్రకటనలో తెలిపింది. దేవాలయ పునరుద్ధరణ, నూతన ధ్వజస్తంభ సహిత స్వర్ణ శిఖర ప్రాణప్రతిష్ఠ, కుంభాభిషేకాలు బుధవారం నుంచి ప్రారంభమవుతాయు. 18వ తేదీ నుంచి భక్తుల దర్శనాలకు అనుమతిస్తారు.

శ్రీ పంచమి సందర్భంగా సరస్వతీదేవిగా దుర్గమ్మ
శ్రీపంచమి సందర్భంగా అమ్మవారి మూలవిరాట్టు, ఉత్సవ మూర్తులు బుధవారం సరస్వతీ దేవి అలంకారంలో దర్శనమివ్వనున్నారు. విద్యార్ధులకు ఉదయం 7 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ముఖమండపం నుంచి అమ్మవారి ఉచిత దర్శనం ఉంటుందని, అనంతరం పెన్ను, ప్యాకెట్‌సైజు అమ్మ ఫొటో, రక్షా కంకణం, కుంకుమప్రసాదం అందజేస్తారు.