News

వీరశైవ ఆగమం ప్రకారమే శ్రీశైలం మహాకుంభాభిషేకం ; హైకోర్టుకు నివేదించిన దేవదాయశాఖ

246views

శ్రీశైలం మహాకుంభాభిషేకం, ఇతర కార్యక్రమాలను వీరశైవ ఆగమం ప్రకారమే నిర్వహిస్తామని దేవదాయ శాఖ సోమవారం హైకోర్టుకు నివేదించింది. ఈ వివరాలను నమోదు చేసిన హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ధీరజ్‌సింగ్‌ ఠాకూర్‌, జస్టిస్‌ ఆర్‌.రఘునందనరావుతో కూడిన ధర్మాసనం పిల్‌ను పరిష్కరించింది. శ్రీశైలంలో మహాకుంభాభిషేకం, ఇతర పవిత్ర కార్యక్రమాలను వీరశైవ ఆగమ సంప్రదాయాల ప్రకారమే నిర్వహించేలా దేవదాయశాఖ అధికారులను ఆదేశించాలని కోరుతూ అఖిల భారత వీరశైవ ధార్మి ఆగమ పరిషత్‌ ఛైర్మన్‌ సంగాల సాగర్‌ హైకోర్టులో సోమవారం అత్యవసరంగా ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. ఈ పిల్‌ను హైకోర్టు లంచ్‌మోషన్‌గా విచారణకు స్వీకరించింది. పిటిషనర్‌ తరఫున న్యాయవాది వీవీ సతీష్‌ వాదనలు వినిపించారు.