News

అయోధ్య రాముడి సన్నిధిలో యోగి, 325 మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు

317views

ఉత్తర్‌ప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ తన కేబినెట్‌లోని మంత్రులు.. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలిసి ఆదివారం అయోధ్య రాముడిని దర్శించుకున్నారు. 10 ప్రత్యేక బస్సుల్లో వచ్చిన దాదాపు 325 మంది ప్రజాప్రతినిధులకు ‘జై శ్రీరామ్‌’ నినాదాలతో భక్తులు ఘనస్వాగతం పలికారు. కాంగ్రెస్‌, బీఎస్పీ, ఆర్‌ఎల్‌డీ వంటి ఇతర పార్టీలకు చెందిన కొంతమంది నేతలు కూడా అయోధ్య ఆలయాన్ని దర్శించుకున్నారు.