News

రామాలయంలో రూ.4 లక్షల విలువైన ఆభరణాల చోరీ

279views

వైయస్సార్ జిల్లా వేంపల్లెలోని స్థానిక పులివెందులరోడ్డులో టీచర్స్‌కాలనీలోని రామాలయంలో గుర్తు తెలియని వ్యక్తులు స్వామివారి ఆభరణాలు అపహరించారని సీఐ చాంద్‌బాషా తెలిపారు. మంగళవారం రాత్రి దుండగలు ఆలయ వాకిళ్లు పగులకొట్టి వెండి కిరీటాలు, 18గ్రాముల బంగారు నగలు తస్కరించారు. బుధవారం ఉదయం కాలనీవాసుల సమాచారంతో ఘటన స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ చెప్పారు.