News

విశాఖ శారదా పీఠానికి రాష్ట్ర హైకోర్టు నోటిసులు

270views

తిరుమలలో విశాఖ శారదా పీఠం చేపట్టిన నిర్మాణాలు నిలిపి‌వేయాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు శారదా పీఠం, టీటీడీకి నోటీసులు జారీ చేసింది. నిర్మాణాల్లో జరిగిన అతిక్రమణలు తేల్చేందుకు అడ్వకేట్ కమిషనర్ నియమించింది. అలాగే భవన నిర్మాణాలను క్షేత్ర స్థాయిలో పరిశీలించి నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. అయితే భద్రత విషయంలో రాజీ పడలేమమని కోర్టు తేల్చి చెప్పింది. శారదాపీఠం అక్రమ నిర్మాణాలు చేపడుతున్నా… టీటీడీ చర్యలు తీసుకోవడం లేదంటూ తిరుక్షేత్ర రక్షణ ప్రతినిధి తుమ్మా ఓంకార్.. కోర్టులో పిల్ వేశారు. సెట్ బ్యాక్‌ వదల కుండా అదనపు అంతస్తుల నిర్మాణం చేపడుతున్నారని ఆరోపించారు. వాదనలు విన్న హైకోర్టు విచారణను మూడు వారాలకు వాయిదా వేసింది.