
257views
బొబ్బిలి యుద్ధం తెలియని వారుండరు. అలాంటి మరువలేని ఘటన జరిగి నేటికి 270 ఏళ్లు పూర్తయింది. ఈ సందర్భంగా బొబ్బిలి రాజులు, వారసులు యుద్ధ స్తంభం వద్ద బుధవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. తొలుత ప్రధాన కూడలిలోని తాండ్ర పాపారాయుడు విగ్రహం వద్ద నివాళులర్పించారు. ఆపై యుద్ధం జరిగిన ప్రాంతం భైరవసాగరం వద్దకు వెళ్లి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. యుద్ధంలో వినియోగించిన కత్తులు, బళ్లాలను ప్రదర్శనలో ఉంచారు. బేబినాయన మాట్లాడుతూ.. నేటి యువత బొబ్బిలి తెగువ చూపాలని, అప్పుడే సమాజం అభివృద్ధి చెందుతుందని పేర్కొన్నారు.





