
371views
ఇంద్రకీలాద్రి ప్రదక్షిణ ఈ నెల 25వ తేదీన నిర్వహించనున్నట్టు దుర్గామల్లేశ్వరస్వామివార్ల దేవస్థాన ఈవో కేఎస్ రామారావు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. గురువారం ఉదయం 5.55 గంటలకు దుర్గగుడి ఘాట్‌రోడ్డు వద్ద ఉన్న కామధేను అమ్మవారి ఆలయం నుంచి ప్రదక్షిణ ప్రారంభమై కుమ్మరిపాలెం, నాలుగు స్తంభాల సెంటర్, సితారా, కబేళా, పాలఫ్యాక్టరీ, చిట్టినగర్, కొత్తపేట, నెహ్రూబొమ్మ సెంటర్, బ్రాహ్మణ వీధి ద్వారా ఉదయం 9 గంటలకు మహామండపం వద్దకు చేరుకుంటుంది. సుమారు 7 కిలోమీటర్ల కాలినడకన ఇంద్రకీలాద్రి ప్రదక్షిణ సాగుతుంది. భక్తులు పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులు కావాలని ఈవో కోరారు





