
196views
అయోధ్యలో రామ మందిర ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకుని దేశ వ్యాప్తంగా భారీ ఎత్తున ర్యాలీలు చేపట్టారు. అన్ని ప్రాంతాల్లో భక్తి పాటలు, కోలాటాలతో వేడుకగా శ్రీరాముడి ఊరేగింపు నిర్వహించారు. బాల రాముడి ప్రాణ ప్రతిష్ట సందర్భంగా మహారాష్ట్రలో చేపట్టిన ర్యాలీలో ముంబైలోని మీరారోడ్ ప్రాంతంలో షాకింగ్ ఘటన జరిగింది. ముంబై శివార్లలోన మీరా రోడ్డులో కార్లు, బైక్‌లపై కాషాయ జెండాతో ఆదివారం రాముడి శోభా యాత్ర నిర్వహించారు.వేడుకలు జరుపుకుంటున్న భక్తులపై దుండగులు మూకుమ్మడిగా దాడికి పాల్పడ్డారు. శ్రీరాముని జెండాలు ఎగుర వేసిన వాహనాలపై రాళ్లు రువ్వారు. అంతేకాకుండా కర్రలతో కొట్టారు. ఈ దాడితో ఆ ప్రాంతంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ ఘర్షణకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఈ ర్యాలీలో ఓ వర్గానికి చెందిన వ్యక్తులు దాడి చేశారు. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య మధ్య వాగ్వాదం పెరిగింది. ఈ ఘటనలో పలువురికి గాయాలయ్యాయి. ఇప్పటికే ఈ కేసులో పోలీసులు ఇప్పటి వరకు 13 మందిని అరెస్ట్ చేశారు. దీనిపై స్పందించిన డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ మహారాష్ట్రలో శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే ఊరుకునే ప్రసక్తి లేదని హెచ్చరించారు.





