News

అయోధ్యలో 108 అడుగుల అగరుబత్తి.. వెలిగించిన రామజన్మభూమి ట్రస్ట్ అధినేత..

271views

అయోధ్య శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ అధినేత మహంత్ నృత్య గోపాల్ దాస్ 108 అడుగుల ఎత్తైన అగరుబత్తిని వెలిగించి ముఖ్య కార్యక్రమానికి తెరతీశారు. గుజ‌రాత్ నుంచి ప్రత్యేకంగా తెప్పించిన ఈ అగ‌ర‌ుబత్తిని జై శ్రీరామ్ నినాదాల మధ్య వెలిగించారు. 3,610 కిలోల బరువు, మూడున్నర అడుగుల వెడల్పు ఉన్న అగరబత్తి నుంచి వచ్చే పొగ చుట్టుపక్కల 50 కిలోమీటర్ల వరకు వ్యాపిస్తుందని తయారీదారులు చెబుతున్నారు.

ఈ 108 అడుగుల అగరుబత్తిని ఆవు పేడ, నెయ్యి, పూలు, మూలికలు, సుగంధద్రవాలను ఉపయోగించి తయారు చేశారు. దీనిని ఒక్కసారి వెలిగిస్తే సుమారు నెలన్నర పాటు మండుతుంది. దీని తయారీకి ఆరు నెలలకు పైగా సమయం పట్టిందని తయారీదారులు తెలిపారు. జనవరి 22న జరగనున్న అయోధ్యలోని రామ మందిర ప్రాణ ప్రతిష్ఠ మహోత్సవ సన్నాహాల్లో భాగంగా ఈ కార్యక్రమం జరిగింది.