News

‘అయోధ్య’ బొమ్మతో వెండి ఉంగరం

311views

గుజరాత్‌లోని భావ్‌నగర్‌కు చెందిన జైలంగానియా అనే ఆభరణాల వ్యాపారి వెండి ఉంగరంపై అయోధ్య రామాలయ నమూనాను తీర్చిదిద్దారు. 22 రోజుల వ్యవధిలో 24 గ్రాముల వెండిని ఉపయోగించి డిజిటల్‌గా తయారుచేసిన ఈ ఉంగరం ధర మార్కెట్లో రూ.8,600 ఉంది. కొంత బంగారం కూడా కలిపిన ఇందులో హనుమాన్‌ విగ్రహం, రామ్‌దర్బార్‌ ఉన్నాయి. ఇప్పటివరకు 130 దేవాలయాల బొమ్మలతో ఈయన ఆభరణాలు చేశారు.

అయోధ్యలో 14 నుంచి మహాయజ్ఞం

అయోధ్యలో జనవరి 14 నుంచి 25 దాకా రామనామ మహాయజ్ఞం జరుపుతున్నట్లు నిర్వాహకులు బుధవారం ప్రకటించారు. ఈ యజ్ఞంలో నర్మదానది రాళ్లతో రూపొందించిన 1,008 శివలింగాలను ప్రతిష్ఠిస్తారు. ‘నేపాలీ బాబా’ ఆత్మానంద్‌ దాస్‌ మహాత్యాగి ఆధ్వర్యంలో జరిగే ఈ యాగం తర్వాత శివలింగాలను సరయూ నదిలో నిమజ్జనం చేస్తారు.