
అయోధ్య రామమందిర ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి హాజరు కావాలని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్- ఆర్ఎస్ఎస్ సర్ సంఘచాలక్ డాక్టర్.మోహన్ భగవత్ కు బుధవారం అహ్వానం అందింది. ఈ మేరకు అయోధ్య రామమందిర నిర్మాణ కమిటీ ఛైర్మన్ నృపేంద్ర మిశ్ర, విశ్వహిందూ పరిషత్ అంతర్జాతీయ వర్కింట్ ప్రెసిడెంట్ అలోక్ కుమార్ దిల్లీలోని భగవత్ ఇంటికి వెళ్లి ఆహ్వానం అందించారు.
ఈ మేరకు సర్ సంఘచాలక్ డాక్టర్.మోహన్ భగవత్ మాట్లాడుతూ, శ్రీరామమందిర ప్రాణప్రతిష్ఠలో పాల్గొనే అవకాశం లభించడం గొప్ప అదృష్టమని అన్నారు. “చాలా ఏళ్ల తర్వాత మనం భారత్ స్వీయ చిహ్నాన్ని పునర్నిర్మించాము. మనం ధర్మబద్ధంగా చేసిన ప్రయత్నాల కారణంగా అది సాధ్యమైంది. ఇది ఒక విధంగా భారత్ తనంతట తానుగా నిలబడిందని, ఇప్పుడు ప్రపంచ శ్రేయస్సు, శాంతి కోసం ముందుకు సాగుతుందని ప్రపంచానికి చాటి చెప్పడం. ఈ ప్రాణప్రతిష్ఠ ద్వారా ఎన్నో దశాబ్దాలుగా వెతుకుతున్న దిశను మనం కొనుగొన్నాము.” అని మోహన్ భగవత్ పేర్కొన్నారు.





