
అయోధ్య రాముడి ప్రాణప్రతిష్ఠ వేడుక కోసం దేశమంతా ఆతృతగా ఎదురుచూస్తోంది. ఈ మేరకు కొంతమంది భక్తులు తమ సాయంగా ఉడతాభక్తిని ప్రదర్శించుకుంటున్నారు. తాజాగా మహారాష్ట్రలోని నాగపూర్ కు చెందిన రాజేంద్ర అనే యువకుడు 1,001 మంది ఉచితంగా రామనామాలను టాటూగా వేయాలని నిర్ణయించుకున్నాడు.మహారాష్ట్రలోని నాగ్‌పుర్‌కు చెందిన హృతిక్ రాజేంద్ర దారోడే (22) అనే కళాకారుడు అయోధ్య రాముడి ప్రాణప్రతిష్ఠను పురస్కరించుకొని 1,001 మందికి ఉచితంగా పచ్చబొట్లు (టాటూలు) వేయాలని సంకల్పించుకున్నాడు.
వివిధ రూపాల్లోని రాముడి చిత్రాలను చేతులు, ఛాతీ, భుజాలపై అందంగా డిజైన్ చేస్తున్నాడు. ఒక్కో టాటూకు హృతిక్‌కు రూ.350 ఖర్చు అవుతుంది. వెయ్యిమందికి సుమారు రూ.3.5 లక్షలు అవుతోంది. టాటూ ఆర్టిస్ట్‌గా పనిచేసే రాజేంద్ర.. తన దగ్గరకు వచ్చే భక్తులకు ఉచితంగా శ్రీరామ్ నామాన్ని టాటూగా వేస్తున్నాడు. రాముడి చిత్రాలను అందంగా చేతులు, ఛాతి, భుజాలపై డిజైన్ చేస్తున్నాడు. ఈ ఆఫర్ కు ప్రజల నుంచి భారీ స్పందన వస్తోంది. పచ్చబొట్టు వేయించుకునేందుకు క్యూలు కడుతున్నారు. రద్దీ ఎక్కువగా ఉన్న ఏం పర్లేదు అన్నట్లు వెయిట్ చేసి మరీ టాటూ వేయించుకుని భక్తిని చాటుకుంటున్నారు.





