
235views
దళిత క్రిస్టియన్లకు ఎస్సీ హోదా కొనసాగించడంతో పాటు ఎస్సీ కులాల్లో చేర్చాలని జాతీయ స్థాయిలో ఏర్పాటైన జస్టిస్ బాలక్రిష్ణన్ కమిషన్ ను కలిసి విజ్ఞప్తి చేశామని రాష్ట్ర సాంఘిక సంక్షేమశాఖ మంత్రి మేరుగ నాగార్జున తెలిపారు. వారికి ఎస్సీ హోదా విషయమై జస్టిస్ కేజీ బాల క్రిష్ణన్ ఛైర్మన్ గా ఏర్పాటైన కమిషన్ మంగళవారం రాష్ట్ర సచివాలయంలో విచారణ చేపట్టింది. ఆ కమిషన్ ను కలిసిన అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడారు. ‘రాష్ట్రంలో ప్రస్తుతం 59 కులాలు షెడ్యూల్ కులాల జాబితాలో ఉన్నాయి. ఎస్సీల జీవన స్థితిగతులు మారని కారణంగా ఇతర రాష్ట్రాల్లో సిక్కు, బౌద్ధ మతంలోకి వెళ్లిన వారిని మళ్లీ ఎస్సీ కులాల్లోనే కొనసాగించారు. అలాగే క్రిస్టియన్ మతంలోకి మారిన దళితులనూ ఎస్సీలుగా కొన సాగించాలని కోరాం. దీనిపై గతేడాది అసెంబ్లీలో తీర్మానం ఆమోదించి కేంద్రానికి పంపించాం’ అని వివరించారు.





