News

స్వచ్ఛ ఆలయం ప్రచారాన్ని ప్రారంభించిన ప్రధాని

367views

దేశంలో ఆధ్యాత్మిక ప్రదేశాలు  అపూర్వంగా తీర్చిదిద్దే లక్ష్యంతో ప్రధానమంత్రి  నరేంద్ర మోదీ  ‘స్వచ్ఛ ఆలయం ప్రచారాన్ని ప్రారంభించారు. జనవరి 22న అయోధ్యలో జరగనున్న  రామమందిర  ప్రతిష్ఠాపనను పురస్కరించుకుని   ప్రధానమంత్రి  ఈ ప్రచారాన్ని ప్రారంభించారు. అయోధ్యను భారతదేశంలో అత్యంత పరిశుభ్రమైన నగరంగా మార్చేందుకు ప్రజలు  ఏకం కావాలని నరేంద్ర  మోదీ సామాజిక మాధ్యమం వేదికగా  పిలుపునిచ్చారు.ఈ సందర్భంగా ఆయన ఒక వీడియో పోస్ట్ చేశారు.  మకర సంక్రాంతి  నుండి ప్రారంభించి జనవరి 22 వరకు చిన్న పుణ్యక్షేత్రాల వద్ద పరిశుభ్రత ప్రచారాన్ని ప్రారంభించాలని ప్రధానమంత్రి సూచించారు.