News

మరోసారి రెచ్చగొట్టే వ్యాఖ్యలు సిక్కు వేర్పాటువాది

285views

ఖలిస్థానీ ఉగ్రవాది, నిషేధిత ‘సిఖ్స్‌ ఫర్‌ జస్టిస్‌’ నేత గురుపత్వంత్‌ సింగ్‌ మరోసారి భారత్‌లో హింసాకాండ రెచ్చగొట్టే ప్రకటన చేశాడు. అయోధ్యలో రామ మందిరంలో రాముడి ప్రాణప్రతిష్ట కార్యక్రమం జరిగే రోజు (జనవరి 22న) అమృత్‌సర్‌ నుంచి అయోధ్య వరకు ఎయిర్‌పోర్టులు మూసివేయాలన్నాడు. సిఖ్స్‌ ఫర్‌ జస్టిస్‌(SFJ)సైతం రామ మందిరాన్ని ముస్లింలు వ్యతిరేకించాలని రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసింది.

‘ఇప్పుడు సమయం వచ్చింది.. ముస్లిలంతా రామ మందిరాన్ని వ్యతిరేకించాలి’ అని రెచ్చగొడుతూ.. గరుపత్వంత్‌ సింగ్‌ సోమవారం వీడియో రిలీజ్‌ చేశాడు. దీంతో భారత్‌ అప్రమత్తమైంది. ఎలాంటి అవాంఛనీయ పరిణామాలు చోటుచేసుకోకుండా.. పోలీసులు అన్ని చోట్ల కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు.