News

హిందూ ధర్మంపై మక్కువ పెంచుకోవాలి

319views

హిందూ ధర్మంపై ప్రజలకు మక్కువ పెంచుకోవాలని కాణిపాకం స్వయంభు శ్రీ వరసిద్ధి వినాయకస్వామి ఆలయ పాలకమండలి ఛైర్మన్‌ ఎ.మోహన్‌రెడ్డి, ఈవో ఎ.వెంకటేశు తెలిపారు. తిరుపతికి చెందిన గుడి-బడి బృంద సభ్యులు 120 మందితో ఆదివారం ప్రధాన ఆలయం, అనుబంధ ఆలయాలైన మణికంఠేశ్వరస్వామి, వరదరాజస్వామి, ఆస్థాన మండపం, ఈవో కార్యాలయం తదితరాల్లో శుభ్రత కార్యక్రమం నిర్వహించారు. ఛైర్మన్‌, ఈవో మాట్లాడుతూ అన్ని ధర్మాల్లో హిందూ ధర్మం చాలా గొప్పదన్నారు. ఈ విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత ప్రతి ఒక్క హిందువు పై ఉందన్నారు. జిల్లాలోని అన్ని ఆలయాల్లో ఇలాంటి శుభ్రత కార్యక్రమాన్ని నిర్వహించాలని వారు సూచించారు. ఏఈవోలు ఎస్వీ కృష్ణారెడ్డి, విద్యాసాగర్‌రెడ్డి, సూపరింటెండెంట్‌ శ్రీధర్‌బాబు, ఇన్‌స్పెక్టర్లు రమేశ్‌, గిరి, భక్తులు పాల్గొన్నారు.