
302views
ఢాకాలో ఆదివారం ఓటు హక్కు వినియోగించుకున్న అనంతరం బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా మీడియాతో మాట్లాడుతూ.. భారత్ తో తన అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. “భారత్ లాంటి నమ్మక మైన మిత్రదేశం ఉండడం మా అదృష్టం. బంగ్లాదేశ్ విముక్తి పోరాటంలో వారు మాకు అండగా ఉన్నారు. 1975లో మా కుటుంబం మొత్తాన్ని కోల్పోయినప్పుడు నాకు ఆశ్రయమిచ్చారు” అని వ్యాఖ్యానించారు.ఎన్నికలను బహిష్కరించిన ప్రతిపక్ష బీఎన్పీ కూటమికి ప్రజాస్వామ్యంపై విశ్వాసం లేదని షేక్ హసీనా విమర్శించారు.





