
302views
ఉత్తర్‌ప్రదేశ్‌లోని జ్ఞానవాపి మసీదుపై భారత పురావస్తు విభాగం(ఏఎస్‌ఐ) సమర్పించిన సర్వే నివేదికను బహిరంగపరచాలా లేదా అన్న విషయంపై శుక్రవారం వారణాసి కోర్టు నిర్ణయించనుంది. కాశీ విశ్వనాథుని ఆలయం పక్కన ఉన్న ఈ మసీదును ఆలయంపై నిర్మించారని హిందువులు పిటిషన్ వేశారు. దీన్ని నిర్ధారించేందుకు గత ఏడాది జులైలో కోర్టు శాస్త్రీయ సర్వేకు ఆదేశించింది. దీంతో సర్వే నిర్వహించిన ఏఎస్‌ఐ ఇటీవల నివేదికను న్యాయస్థానానికి సమర్పించింది. అయితే తమ నివేదికను మరో నాలుగు వారాలు బహిరంగపరచొద్దని బుధవారం ఏఎస్‌ఐ కోరింది. దీనిపై న్యాయస్థానం తన నిర్ణయాన్ని వెలువరించనుంది.





