
584views
ప్రపంచంలోనే అతిపెద్ద ధ్యాన కేంద్రం(మెడిటేషన్ సెంటర్) మన భారతదేశంలోనే కొలువుదీరింది. ఈ భారీ నిర్మాణంతో భారత్ అధ్యాత్మకి వికాసానికి పెద్ద పీఠవేస్తూ శాంతియుతంగా ఉండేలా చేస్తుందని అధికారులు చెబుతున్నారు. ఆ అతిపెద్ద ధ్యాన కేంద్రం ఎక్కడ ఉందంటే..?

ఆ అతిపెద్ద ధ్యాన కేంద్రం(మెడిటేషన్ సెంటర్) ప్రధాని నరేంద్ర మోదీ పార్లమెంట్ నియోజకవర్గమైన వారణాసిలో ఉంది. దీన్ని ప్రధాని మోదీ సోమవారమే ప్రారంభించారు. ఈ ధ్యాన కేంద్రం పేరు ‘స్వర్వేద్ మహామందిర్’. ఆధ్యాత్మికంగా దైవత్వ వైభవానికి ఆ ధ్యాన కేంద్రం ప్రధాన ఆకర్షణ అని మోదీ పేర్కొన్నారు. ఇది భారతదేశ సామాజిక ఆధ్యాత్మిక బలానికి అత్యాధునిక చిహ్నం ఈ స్వర్వేద్ మహామందిర్. ఈ ప్రారంభోత్సవంలో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కూడా పాల్గొన్నారు.

ఈ మందిర్‌కి సంబంధించిన ఆసక్తికర విశేషాలు..






