
వారణాసిలోని జ్ఞానవాపి మసీదు, కాశీ విశ్వనాథ్ టెంపుల్‌పై దాఖలైన పిటిషన్‌కు సంబంధించి ముస్లిం సంఘాలకు చుక్కెదురైంది. సున్నీ సెంట్రల్ వక్ఫ్ బోర్డు, అంజుమన్ ఇంతేజామియా మసీదు కమిటీ వేసిన పిటిషన్‌ను అలహాబాద్ హైకోర్టు కొట్టివేసింది. జ్ఞానవాపి మసీదు ఉన్న స్థలంలో ఆలయాన్ని పునరుద్ధరించాలని కోరుతూ వారణాసి కోర్టులో పెండింగ్‌లో ఉన్న సివిల్ దావా విచారణ అర్హత సవాలు చేస్తూ వచ్చిన మొత్తం ఐదు పిటిషన్‌లపై మంగళవారం విచారణ జరిపిన అలహాబాద్ హైకోర్టు కొట్టివేసింది.
1991 నాటి ప్రార్థనా స్థలాల (ప్రత్యేక నిబంధనలు) చట్టం ప్రకారం ఆగష్టు 15, 1947కు ముందు మతపరమైన ప్రదేశాల స్వరూపాన్ని ఉనికిలో ఉన్నట్లుగా మార్చడాన్ని పరిమితం చేస్తుందని అంజుమన్ ఇంతేజామియా మసాజిద్ కమిటీ, యూపి సున్నీ సెంట్రల్ వక్ఫ్ బోర్డ్ వాదనలు వినిపించింది. ఈ మేరకు మంగళవారం అలహాబాద్ హైకోర్టు తీర్పు వెల్లడించింది. ఇక ఆలయాన్ని పునరుద్ధరించాలని కోరుతున్న సివిల్ పిటిషన్లకు హైకోర్టు అనుమతి ఇస్తున్నట్లు పేర్కొంది.





