
669views
ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయానికి శనివారం ఉదయం ఓ అజ్ఞాత వ్యక్తి ఫోన్ చేశాడు. మరికొద్ది నిమిషాల్లో ప్రధాన కార్యాలయాన్ని పేల్చి వేస్తున్నామంటూ అతడు చెప్పాడు. దీంతో వెంటనే ఢిల్లీ పోలీసులకు బాంబు బెదిరింపు ఫోన్‌కాల్ గురించి ఆఫీసు సిబ్బంది సమాచారం అందించింది. హెడ్‌క్వార్టర్స్‌లో ఉన్న కంట్రోల్ రూమ్‌కు ఆ కాల్ రావడంతో సోదాలు నిర్వహించారు. అయితే అది నకిలీ ఫోన్‌కాల్ అని పోలీసులు గుర్తించారు. ర్నాటకలోని మైసూర్ నుంచి బీజేపీ ఆఫీసుకు ఫోన్ వచ్చినట్లు గుర్తించారు. ప్రస్తుతం ఈ ఘటనను పోలీసులు చాలా సీరియస్ గా తీసుకొని విచారణ సాగిస్తున్నారు.





