
183views
శ్రీరాముడి జీవితంలో కీలక ఘట్టాలను తెలియజేసే విధంగా విగ్రహాలతో అయోధ్యలో శోభాయాత్ర నిర్వహించనున్నారు. అయోధ్యలో ప్రతిష్ఠాపన మహోత్సవ కార్యక్రమానికి గుర్తుగా జనవరి 17న సుమారు 100 విగ్రహాలతో శోభాయాత్రను నిర్వహిస్తున్నట్లు శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ నిర్వాహకులు తెలిపారు. వారం రోజులపాటు జరిగే రామ్‌లల్లా విగ్రహ ప్రతిష్ఠాపనా మహోత్సవాలకు ఈ శోభాయాత్రతోనే శ్రీకారం చుట్టనున్నారు. శ్రీరాముడి జననం నుంచి వనవాసం, రావణుడిపై విజయం, అయోధ్యకు తిరిగి రావడం వంటి కీలక ఘట్టాలు తెలిపే విధంగా విగ్రహాలు ఉంటాయని ప్రధాన శిల్పి రంజిత్ మండల్ తెలిపారు.





