News

నేటి నుంచి పల్నాటి వీరారాధనోత్సవాలు

309views

పల్నాటి వీరారాధన ఉత్సవాలు మంగళవారం నుంచి ఐదు రోజులపాటు రణక్షేత్రం కారెంపూడి (కార్యమపూడి)లో ప్రారంభం కానున్నాయి. క్రీ.శ.1182లో జరిగిన పల్నాటి యుద్ధంలో అమరులైన వీరులను పల్నాటి వీరుల వారసులు వంశపారంపర్యంగా ఏటా రణక్షేత్రానికి తరలివచ్చి స్మరించుకోవడం ఆనవాయితీగా వస్తోంది. రెండు తెలుగు రాష్ట్రాలలో ఉన్న వేలాది మంది వీరాచారులు తరలివచ్చి తమ ఆచారాలను పాటించనున్నారు. వీరుల ఆయుధాలను దైవాలుగా కొలుస్తూ గ్రామోత్సవాలు నిర్వహిచనున్నారు. కత్తి సేవలు చేయనున్నారు. వీర్ల అంకాలమ్మ తల్లి, చెన్నకేశవస్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. పల్నాటి చరిత్రలో ముఖ్యమైన ఐదు చారిత్రక ఘట్టాల పేర్లతో ఐదు రోజులపాటు ఉత్సవాలు జరగనున్నాయి. మొదటి రోజు 12న రాచగావు, 13న రాయబారం, 14న మందపోరు, 15న కోడిపోరు ఉత్సవాలు జరగనున్నాయి. చివరి రోజు కళ్లిపాడుతో ఉత్సవాలు ముగుస్తాయి.

14న బ్రహ్మనాయుడు చాపకూడు అమలు

ఈ ఉత్సవాలలో మందపోరు నాడు 14వ తేదీ బ్రహ్మనాయుడు చాపకూడు సిద్ధాంతాన్ని అమలు చేయనున్నారు. అందుకు వేలాది మందికి అన్నదాన ఏర్పాట్లు జరుగుతున్నాయి. 15వ తేదీ జరిగే కోడి పోరు ఉత్సవం ప్రధానమైనది. ఈ కార్యక్రమానికి వేలాదిగా ప్రజలు తరలి రానున్నారు. అంకాలమ్మ తల్లి, చెన్నకేశవస్వామికి పూజలు చేయనున్నారు. అనంతరం వీరుల గుడికి తరలి వచ్చి పల్నాటి వీరుల ఆయుధాలకు పూజలు నిర్వహించనున్నారు.