News

పాత‌బ‌స్తీలో తీవ్ర ఉద్రిక్త‌త‌…పోలీసుల లాఠీఛార్జి.. ఎమ్మెల్యే రాజాసింగ్‌కు తీవ్ర గాయాలు

641views

హైదరాబాద్‌లోని పాత‌బ‌స్తీ జుమ్మేరాత్ బజార్ లో గత అర్ధరాత్రి తీవ్ర ఉద్రిక్త చోటు చేసుకుంది.  స్థానికులు స్వాతంత్ర్య సమరయోధురాలు రాణి అవంతిభాయ్‌ విగ్రహాన్ని త‌ర‌లిస్తుండ‌గా, ఓ వర్గం వారు అడ్డుకున్నారు. దీంతో ఇరు వ‌ర్గాల మ‌ధ్య తీవ్ర ఘ‌ర్ష‌ణ త‌లెత్తింది. విషయం తెలుసుకున్న పోలీసులు వచ్చేసరికే గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ తన మద్దతుదారులతో చేరుకుని, స్థానికులతో కలిసి నిరసనకు దిగారు. మరో వర్గం స్థానికులు వీరిపై రాళ్లురువ్వారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఆందోళనకారులను చెదరగొట్టేందుకు లాఠీచార్జ్‌ చేయగా, రాజాసింగ్‌ తలకు తీవ్ర గాయాలయ్యాయి. ఆయన‌ను చికిత్స నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. దేశం కోసం పోరాడిన యోధురాలి విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తుంటే దాడి చేస్తారా? అని ఈ సందర్భంగా రాజాసింగ్ తీవ్ర స్థాయిలో ధ్వ‌జ‌మెత్తారు. ఈ ఘటనపై డీజీపీకి ఫిర్యాదు చేయనున్నట్టు రాజాసింగ్ తెలిపారు.

చికిత్స పొందుతున్న ఎమ్మెల్యే రాజాసింగ్