
240views
స్వల్పశ్రేణి బాలిస్టిక్ క్షిపణి ‘అగ్ని-1’ను శిక్షణలో భాగంగా ఒడిశా తీరంలోని ఏపీజే అబ్దుల్ కలాం దీవి నుంచి భారత్ గురువారం విజయవంతంగా ప్రయోగించింది. నిర్దేశిత పరామితులన్నింటినీ అది కచ్చితత్వంతో అందుకున్నట్లు రక్షణ శాఖ అధికారి ఒకరు తెలిపారు. చివరగా ఈ ఏడాది జూన్ 1న అగ్ని-1ను ఇదే దీవి నుంచి విజయవంతంగా పరీక్షించారు.





