News

సనాతన ధర్మంలోకి తిరిగి వచ్చిన 25 మంది

269views

ఉత్తరాఖండ్‌లోని బాగేశ్వర్‌లో అన్యమతాలకు 25 మంది స్వధర్మాన్ని స్వీకరించారు. తద్వారా సనాతన హిందూ ధార్మికంలోకి తిరిగి ప్రవేశించారు. హిందూ మతంలోకి తిరిగి రావాలనుకునే వ్యక్తుల కోసం ఘర్ వాపసీ కార్యక్రమాన్ని హిందూ సమాజం చేపడుతోంది. ఇందులో భాగంగా కాలభైరవ ఆలయంలో ఏర్పాటు చేసిన శుద్ధి కార్యక్రమంలో పాల్గొని 25 మంది ఒకేసారి హిందూ మతాన్ని స్వీకరించారు.

ఘర్ వాపసీ కార్యక్రమంలో భాగంగా హిందూ మతంలోకి ప్రవేశించాలనుకుంటున్న వారి కోసం వైదిక ఆచారాలతో పూజలు నిర్వహించి అనంతరం శుద్ధి యాగం జరిపించారు. ఇందులో భాగంగా స్వధర్మంలోకి తిరిగి వచ్చిన ప్రతి ఒక్కరూ యజ్ఞకుండ్‌లో నైవేద్యాలు సమర్పించారు. పండితులు సరయూ నది నీటితో శుద్ధి నిర్వహిస్తూ, గాయత్రీ మంత్రాన్ని పఠిస్తూ సనాతన ధర్మం యొక్క గొప్పతనాన్ని వారికి తెలియజేసారు.

హిందూ మతాన్ని స్వీకరించిన తర్వాత వారు మాట్లాడుతూ తమ పూర్వీకులు హిందువులే అని, కానీ కొన్ని కారణాల వల్ల వారు ఇతర మతాలను స్వీకరించారన్నారు. తమ పూర్వీకుల తప్పు తెలుసుకున్న తాము తిరిగి సనాతన ధర్మంలోకి వచ్చామన్నారు.

ఈ సందర్బంగా విశ్వహిందూ పరిషత్ జిల్లా అధ్యక్షుడు కైలాష్ సింగ్ గాధియా మాట్లాడుతూ.. సనాతన ధర్మమే అతి పురాతన మతమన్నారు. ఈ ప్రాంతంలోని కొన్ని కుటుంబాల పూర్వీకులు ఒత్తిడుల వల్ల మతం మారారని.. ఇప్పుడు వారి సంతానం పూర్తి ఆచారాలతో సనాతన ధర్మాన్ని తిరిగి స్వీకరించారని తెలిపారు.

Source : Panchjanya.com