News

ఇంద్రకీలాద్రిపై అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి శంకుస్థాపన

318views

విజయవాడ ఇంద్రకీలాద్రి వద్ద పలు అభివృద్ధి పనులకు సీఎం జగన్‌ ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. వీటి వ్యయం రూ.216.05 కోట్లుగా అధికారులు అంచనా వేశారు. తొలుత తాడేపల్లిలోని తన నివాసం నుంచి బయల్దేరిన సీఎం జగన్‌.. విజయవాడ కనకదుర్గానగర్‌కు చేరుకున్నారు.అనంతరం దుర్గగుడి మాస్టర్‌ప్లాన్‌లో భాగంగా చేపట్టనున్న అభివృద్ధి పనులకు జగన్‌ శంకుస్థాపనలు చేశారు.

రూ. 216 కోట్లతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన సీఎం జగన్‌
రూ. 57 కోట్ల రాష్ట్ర నిధుల్లో రూ. 30 కోట్లతో అన్నప్రసాద భవన నిర్మాణం
రూ. 27 కోట్లతో ప్రసాదం పోటు భవన నిర్మాణం
రూ. 13 కోట్లతో ఎలివేటెడ్‌ క్యూ కాంప్లెక్స్‌
రూ. 15 కోట్లతో రాజగోపారం ముందు భాగం వద్ద మెట్ల నిర్మాణం
రూ. 23.50 కోట్లతో దక్షిణాన అదనపు క్యూ కాంప్లెక్స్‌
రూ. 7. 75 కోట్లతో కనకదుర్గానగర్‌ ప్రవేశం వద్ద మహారాజ ద్వార నిర్మాణం
రూ. 18.30 కోట్లతో మల్లికార్జున మహా మండపం వద్ద క్యూ కాంప్లెక్స్‌ మార్పు
రూ. 19 కోట్లతో నూతన కేశఖండన శాల నిర్మాణం
రూ. 10 కోట్లతో ప్రస్తుత గోశాల భవనాన్ని బహుళ సముదాయంగా మార్పు
వంటి అభివృద్ధి పనులకు జగన్‌ శంకుస్థాపనలు చేశారు.