ArticlesNews

మహాపరినిర్వాణ దివస్‌గా బాబాసాహెబ్ అంబేద్కర్ వర్ధంతి

540views

( డిసెంబరు 6 – డాక్టర్ భీమ్ రావ్ అంబేద్కర్ వర్ధంతి )

అంబేద్కర్… సంఘర్షణల నుంచి పుట్టుకొచ్చిన జాతి రత్నం, తరతరాలకు స్ఫూర్తి ప్రదాతగా నిలిచిన బాబా సాహెబ్ రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్. రాజ్యాంగంతో అతి పెద్ద ప్రజాస్వామ్య భారత దేశానికి, ప్రపంచానికి ప్రజాస్వామ్య స్థితి గతులు, విలువలు నేర్పిన దార్శనికుడు డాక్టర్ భీమ్ రావ్ రామ్ జీ అంబేద్కర్, అన్ని వర్గాల వారికి ఆయన ఓ స్ఫూర్తి సంతకం అంతటి విభిన్న కోణాల విశిష్ట వ్యక్తిత్వం మన రాజ్యాంగ నిర్మాతది.

ఆయన రాసిన ఆధునిక ప్రజాస్వామ్య గ్రంధం ఎంత గొప్పదంటే… ఇంత విశాలమైన , విస్తృమైన భారత ఉపఖండం 73 సంవత్సరాల తర్వాత కూడా దాని వల్లే భద్రంగా వుంది. అంబేద్కర్ జీవితం మనకు అందించే ప్రేరణ అనుపమానం ఒక అత్యంత పేద కుటుంబం… అందులో పద్నాలుగురు పిల్లల్లో తానొకరు. పైగా అంటరానితనపు దారుణమైన సంకెళ్లు. అయినా అంబేద్కర్ కలలను ఈ తుఫానులేవీ … విరిచేయలేకపోయాయి. ఆయన తన గ్రామంలోని దళిత వాడ నుంచి ఏకంగా ప్రపంచ స్థాయి నేతగా దీక్షతో , దక్షతతో ఎగిరాడు… ఎదిగాడు.

ఈనాటికీ సమర్ధవంతంగా అమలవుతున్న హిందుకోడ్ , కుటుంబ చట్టం , కార్మిక చట్టాలు వంటివి ఆయన ముందుచూపుకి నిదర్శనాలు, అంబేద్కర్ వల్లే భారతీయ రిజర్వ్ బ్యాంక్ ఏర్పడింది. ఆయన వల్లే దేశంలోని కోట్లాది కార్మికులు క్షేమంగా వుంటున్నారు. ఆయన రూపొందించిన లేబర్ లాసే నేటీకి మన సమాజాన్ని నిర్ధేశిస్తున్నాయి.

అంబేద్కర్ కు 1944లో సెప్టెంబర్ నెలలో ఆంధ్రా పర్యటనకు విచ్చేసారు. పర్యటన సందర్బంగా ఆయన అనకాపల్లి చేరుకున్నారు. అక్కడి వారి అభిమానాన్ని చూసి ముగ్ధులై “ఎవరైనా జాతీయ నాయకులు వస్తే వారికి, జమీందార్లు, నాయకులు స్వాగతం పలుకుతారు కానీ నాకు వచ్చిన వారు పేద ప్రజలు అని ఆనందపరవాసులైనారు. తన జీవిత చరమాంకంలో బౌద్ధ మతాన్ని స్వీకరించారు. గౌతమ బుద్దుని బోధనలకు ప్రభావితమైన అంబేడ్కర్.. బౌద్ధుడిగా మారడంతో ఆయన వర్దంతిని మహాపరినిర్వాణ దివస్‌గా జరుపుకుంటున్నాం.

‘బాబాసాహెబ్’గా ప్రసిద్ధి పొందిన భారతరత్న డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ డిసెంబరు 6, 1956లో కన్నుమూశారు. ఆయన వర్దంతిని ఏటా ‘ మహాపరినిర్వాణ దివస్‌’గా పాటిస్తారు.