
208views
పౌరసత్వ సవరణ చట్టాన్ని (సీఏఏ) అమలు చేసి తీరతామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా తేల్చిచెప్పారు. దీనిని ఎవరూ ఆపలే రని పేర్కొన్నారు. 2024 లోక్ సభ ఎన్నికల ప్రచారాన్ని కోల్ కతాలో ప్రారంభించిన సందర్భంగా అమిత్ షా ఓ బహిరంగ సభలో మాట్లాడారు. బుజ్జగింపు రాజకీ యాలు, సరిహద్దు చొరబాట్లు, అవి నీతి, రాజకీయ హింస వంటి జాడ్యా లతో రాష్ట్రాన్ని నాశనం చేశారని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై విమర్శలతో విరుచుకుపడ్డారు. సీఏఏను ఆమె వ్యతిరేకిస్తున్నారని, కానీ అది అమలు కాకుండా ఎవ్వరూ ఆపలేరని వ్యాఖ్యానించారు.





