
248views
యోగా చేయడం వల్ల మూర్ఛ వ్యాధి లక్షణాలు తగ్గుముఖం పడుతున్నట్లు తమ అధ్యయనంలో తేలిందని ఢిల్లీ ఎయిమ్స్ న్యూరో విభాగం నిర్వహించిన అధ్యయనంలో తేలింది. తరచూ మూర్ఛపోవడం, అపనింద భావనకు గురికావడం, వ్యాకులత వంటివి యోగా వల్ల నియంత్రణలోకి వస్తున్నాయని న్యూరాలజీ విభాగ అధిపతి డాక్టర్ మంజతి త్రిపాఠీ తెలిపారు. ఎయిమ్స్ అధ్యయన వివరాలు వైద్య పరిశోధన పత్రిక ‘న్యూరాలజీ’లో ప్రచురితమయ్యాయి. అధ్యయనం కోసం 160 మంది మూర్ఛ బాధితులను ఎంచుకున్నామని, వారి సగటు వయసు 30 ఏళ్లని పరిశోధకులు వెల్లడించారు.





