
262views
అలహాబాద్ హైకోర్టులో కొనసాగుతున్న శ్రీకృష్ణ జన్మభూమి-షాహీ ఈద్గా వివాదం విచారణను నిలుపుదల చేసేలా (స్టే) ఉత్తర్వులిచ్చేందుకు సుప్రీంకోర్టు శుక్రవారం నిరాకరించింది. షాహీ మసీద్ ఈద్గా నిర్వహణ కమిటీ దాఖలు చేసిన ఈ పిటిషన్‌ను జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్, జస్టిస్ సుధాంశు ధూలియా, జస్టిస్ అహసానుద్దీన్ అమానుల్లాహ్ ధర్మాసనం విచారణకు చేపట్టింది. అవతలి పక్షం వాదనలు వినకుండా స్టే ఇవ్వలేమని స్పష్టం చేసింది. మథుర కోర్టులో ఉన్న పిటిషన్లను అలహాబాద్ హైకోర్టు తన వద్దకు బదిలీ చేసుకుంటూ మే 26న ఉత్తర్వులిచ్చింది. దీనిని ఈద్గా కమిటీ సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. తదుపరి విచారణ జనవరి 9వ తేదీకి వాయిదాపడింది.





