
276views
తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల మొదటిరోజైన శుక్రవారం రాత్రి శ్రీ పద్మావతి అమ్మవారు వెన్నముద్దకృష్ణుని అలంకారంలో చిన్నశేషవాహనంపై భక్తులకు అభయమిచ్చారు. గజరాజులు రాజసంగా ముందు వెళుతుండగా, కళాబృందాల కోలాహలం, భక్తుల కర్పూరహారతుల నడుమ వాహనసేవ వైభవంగా జరిగింది.
బ్రహ్మోత్సవాల్లో మొదటి వాహనం చిన్నశేషుడు. చిన్నశేష వాహనంపై అమ్మవారు జీవకోటిని ఉద్ధరించే లోకమాతగా దర్శనమిస్తారు. శేషభూతమైన ఈ ప్రపంచం సిరులతల్లి రక్షణలో సుఖాన్ని పొందుతోంది. ఈ వాహనంపై అమ్మవారి దర్శనం వల్ల యోగసిద్ధి చేకూరుతుంది.





