News

కాంగ్రెస్ సర్కారు తీరు భలే బేజారు – స్కాలర్షిప్పుల్లో దీనదయాళ్ ఉపాధ్యాయ పేరు తొలగింపు – రాజస్థాన్లో తాజా వివాదం

729views

పిల్లల పాఠ్యాంశాలలోనూ, వివిధ విద్యా సంబంధ పథకాల  పేర్లు మార్చడంలోనూ రాజస్థాన్లోని కాంగ్రెస్ ప్రభుత్వం అత్యుత్సాహం ప్రదర్శిస్తోంది. పాఠ్య పుస్తకాలలో వీర సావార్కర్లోని ‘వీర’ పదం తొలగించటంతోపాటు ఆయన ఆంగ్లేయులను క్షమాభిక్ష కోరినట్లుగా అభివర్ణించిన రాజస్థాన్లోని కాంగ్రెస్ ప్రభుత్వం మరో వివాదానికి తెర లేపింది.

రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్

రాజస్థాన్లో 10,12 తరగతుల పిల్లలకు ఒక పోటీ పరీక్షను నిర్వహించి, అందులో ప్రతిభ చాటిన విద్యార్ధినీ విద్యార్ధులకు దివంగత జనసంఘ్ నేత ‘దీనదయాళ్ ఉపాధ్యాయ’ పేరిట మెరిట్ స్కాలర్షిప్పులు అందించటం జరుగుతోంది. ఇప్పుడు తాజాగా కాంగ్రెస్ ప్రభుత్వం ఆ పథకానికి ఆ పేరు తొలగిస్తున్నట్లు ఆ రాష్ట్ర విద్యా శాఖా మంత్రి ప్రకటించారు. దీనిపై భాజపా వర్గాలు భగ్గుమంటున్నాయి. గతంలో సావార్కర్ పాఠ్యాంశంలో మార్పుల తోపాటు నోట్ల రద్దుపై వున్న పాఠ్యాంశాన్ని తొలగించడం, ప్రసిద్ధ హల్దిఘాటి యుద్దానికి సంబంధించిన పాఠ్యాంశంలో కూడా మార్పులు చేయడం అనేక మందిని ఆందోళనకు గురి చేస్తోంది.

మాజీ విద్యా శాఖా మంత్రి వాసుదేవ్ దేవ్నని

గతంలో మాజీ ప్రధాని శ్రీమతి ఇందిరా గాంధి సావార్కర్ని వీరత్వానికి, దేశభక్తికి పర్యాయపదంగా అభివర్ణించడం తోపాటు, స్ఫూర్తి ప్రదాతగా ఆయనను కొనియాడిన విషయాన్ని భాజపా శ్రేణులు ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాయి. “1970లలో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ఆయన చిహ్నంగా స్టాంపును కూడా విడుదల చేసింది. అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ తన వ్యక్తిగత ఖాతా నుంచి సావార్కర్ ట్రస్ట్ కు 11 వేల రూపాయలను ఇచ్చారు. సావార్కర్ జీవితంపై ఒక డాక్యుమెంటరీని కూడా నిర్మించవలసినదిగా ఆమె చలనచిత్ర విభాగాన్ని ఆదేశించారు.” అని మాజీ విద్యా శాఖా మంత్రి వాసుదేవ్ దేవ్నని ట్వీట్ చేశారు.

విద్యా శాఖా మంత్రి గోవింద్ సింగ్

నిపుణుల కమిటీ సూచనల మేరకే తాము పాఠ్యాంశాలలో మార్పు చేర్పులు చేసినట్లు ప్రస్తుత విద్యా శాఖా మంత్రి గోవింద్ సింగ్ పేర్కొనడం గమనార్హం.