
633views
అయోధ్యలో ఏడు అడుగుల శ్రీరాముడి విగ్రహాన్ని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ 7/6/2019 శుక్రవారం ఆవిష్కరించారు. అయోధ్యలోని శోధ్ సంస్ధాన్ మ్యూజియంలో రోజ్‌ఉడ్‌తో ఈ విగ్రహాన్ని నిర్మించారు. కర్ణాటక నుంచి రూ 35 లక్షలు వెచ్చించి కొనుగోలు చేసిన ఈ విగ్రహాన్ని మ్యూజియంలో ప్రదర్శనకు ఉంచుతారు. రాముడి ఐదు అవతారాల్లో ఒకటైన కోదండరాముని అవతారంలో ఈ విగ్రహం రూపొందింది. మ్యూజియంలో రాముడి గురించిన పలు చారిత్రక ఘట్టాలతో 2500కు పైగా చిత్రాలు, కళారూపాలు ఉన్నా కోదండరాముని గురించి వర్ణించే ఆనవాళ్లు లేవు. కోదండరామ విగ్రహాన్ని కర్ణాటక స్టేట్ ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్ ఎంపోరియం నుంచి కొనుగోలు చేశారు. ఇక యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్ అయోధ్యలో శుక్రవారం మధ్యాహ్నం 2.30 గంటల ప్రాంతంలో ఈ విగ్రహాన్ని ఆవిష్కరించారు.





