News

తిరుమల శ్రీవారి ఆదాయం హిందూ ధర్మ పరరక్షణకే వినియోగించాలి : పూర్వ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు

273views

తిరుమలలో స్వామి వారికి వచ్చే ప్రతి రూపాయినీ హిందూ ధర్మ పరిరక్షణకు వినియోగించాలని పూర్వ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. తిరుమల తిరుపతి దేవస్థాన పాలకమండలి కూడా ఆ విధంగా చర్యలు తీసుకోవాలన్నది తన అభిప్రాయమని తెలిపారు. రాష్ట్రంలోని పురాతన ఆలయాల జీర్ణోద్ధరణకు నిధులు వినియోగించాలన్నారు. తిరుమల శ్రీవారి దర్శనార్థం శుక్రవారం రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్న ఆయన విలేకర్లతో మాట్లాడారు. గ్రామాల్లో ప్రజల సహకారంతోనే ఆలయాల నిర్వహణ, కల్యాణ మండపాల నిర్మాణం వంటివి చేయాలని తెలిపారు.